టాలీవుడ్‌ స్టార్‌ హీరో సినిమాపై కరోనా ఎఫెక్ట్‌‌..!


ప్రపంచాని వణికిస్తూ.. రోజురోజుకూ విజృంభిస్తున్న ప్రాణంతకమైన వైరస్‌ ‘కరోనా’ ప్రభావం ఇప్పుడు టాలీవుడ్‌పై పడింది. ఈ వైరస్‌ కారణంగా టాలీవుడ్ హీరో నాగార్జున నటిస్తున్న ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా షూటింగ్‌ను రద్దు చేశారట. ‘మహర్షి’ సినిమాకు కథ అందించిన అహిషోర్ సాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. సాయామీ ఖేర్‌ కీలకపాత్రలో నటించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ త్వరలో థాయ్‌లాండ్‌లో ఓ కీలక షెడ్యూల్‌ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించాలని చిత్రబృందం నిర్ణయించుకుందట. అయితే కరోనా వైరస్‌ కారణంగా చిత్రబృందం థాయ్‌లాండ్‌ షెడ్యూల్‌ను కొంతకాలంపాటు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.