HomeTelugu Big Storiesపవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌..

పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌..

11
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను వేణు శ్రీరామ్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను దిల్ రాజు బాలీవుడ్ నిర్మాత బోణి కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. హిందీలో అమితాబ్ నటించిన పాత్రలో పవన్ కల్యాణ్‌ నటిస్తున్నాడు. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత పవన్‌ తిరిగి సినిమాల్లోకి రావాలని ఆయన అభిమానులంతా ఎంతగానో కోరుకున్నారు. అయితే పవన్ సినిమాలు మళ్లీ సినిమా ప్రారంభించిన దగ్గర నుంచి అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది ..అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ లుక్ వచ్చేసింది. కొద్దీ సేపటి క్రితమే పవన్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్ . పవన్ గాగుల్స్ పెట్టుకొని పడుకొని ఎదో బుక్ ను చదువుతున్న స్టీల్ ను విడుదల చేశారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu