వీరసింహారెడ్డి: ‘జై బాలయ్య’ మాస్ సాంగ్ విడుదల

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా పై అంచనాలు భారీ అంచనాలు ఉన్నాయి. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ ‘జై బాలయ్య’ పాటను విడుదల చేశారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, కరీముల్లా పాడారు.

వైట్ అండ్ వైట్ డ్రెస్ లో, మీసం మెలేసి, మెడలో బంగారు చైన్లు, చేతికి వాచ్ తో బాలయ్య లుక్ అదిరిపోయేలా ఉంది. ‘రాజసం నీ ఇంటి పేరు… పౌరుషం నీ ఒంటి పేరు’ అంటూ మొదలైన ఈ పాట ఆద్యంతం చాలా పవర్ ఫుల్ గా ఉంది. థమన్ సంగీతం అందించిన ఈ పాట విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. అదిరిపోయే రేంజ్ లో ఉన్న ఈ పాటను చూసి బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2023 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా…. కన్నడ నటుడు దునియా విజయ్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్, కేజీఎఫ్ అవినాశ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates