HomeTelugu Trendingపవన్ కల్యాణ్ కోసం భారీ సెట్‌..!

పవన్ కల్యాణ్ కోసం భారీ సెట్‌..!

10 13

రాజకీయాల్లో బిజీ అయ్యాక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పవన్ మూడు భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిలో ఒకటి పింక్ రీమేక్ కాగా.. ఆ సినిమాకి వకీల్ సాబ్ అనే పేరును పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బకు అన్ని పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. దీని ప్రభావం సినిమారంగంపైనా ఉంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లు అన్నీ నిలిపేసిన సంగతి తెలిసిందే.

కరోనా కారణంగా పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మూవీలో పవన్ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ మొరాకోలో ప్రారంభించాలనుకుది చిత్ర యూనిట్. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్నందున విదేశాల్లో షూటింగ్ చేయడం మంచిది కాదని క్రిష్ బృందం నిర్ణయించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోనే భారీ సెట్స్ వేసి చిత్రీకరణ జరపాలనుకుంటున్నారట. దీనికి పవన్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ మొగలాయిల కాలం నాటి పాత్రలో చేస్తున్నారు. అది రాబిన్ హుడ్ లాంటి పాత్ర. ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ తన లుక్‌ను పూర్తిగా మార్చేసుకున్నాడు. ఆ పాత్ర కోసం గడ్డం కూడా తీసేశాడు. కాస్త మీసం పెద్దదిగా ఆనాటి లుక్‌లో కి మారిపోయారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu