‘మన్మథుడు 2’ లో జాయిన్‌ అయిన కీర్తి సురేష్‌ !

నాగార్జున నటిస్తున్న ‘మన్మథుడు 2’ షూట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఏ చిత్రంలో నాగార్జునకు జోడీగా రకుల్ ప్రీత్ నటిస్తుండగా అక్కినేని సమంత సైతం ఒక కీ రోల్ చేస్తోంది. వీరితో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. చాలా రోజుల నుండి కీర్తి సినిమాలో నటిస్తుందని వార్తలు వస్తున్నా అవి ఈరోజు కన్ఫర్మ్ అయ్యాయి. ఆమె హైదరాబాద్ షెడ్యూల్లో జాయిన్ అయిందట. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.