ఆ నిర్మాతతో పవన్ సినిమా పక్కా!

పవన్ హీరోగా తమిళ చిత్రం ‘వేదాళం’ పవన్ హీరోగా తమిళ చిత్రం ‘వేదాళం’ ని తెలుగులో రీమేక్ చేయడానికి రత్నం ప్లాన్ చేశాడు. తమిళ దర్శకుడు నేసన్ కి ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఇప్పటికే పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే సినిమా ఆగిపోయిందని, తీసుకున్న అడ్వాన్స్ పవన్ కళ్యాణ్ తిరిగి ఇచ్చేశాడని వార్తలు ప్రచారంయ్యాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. 

వేదాలం తెలుగు రీమేక్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని, ఆ సినిమా ఆగిపోయింది అనే వార్తల్లో నిజం లేదని ఎ.ఎం జ్యోతికృష్ణ అన్నారు. కాటమరాయుడు సినిమా తర్వాత… త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సినిమాకి ముందుకు వేదాళం రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నాము. అయితే త్రివిక్రమ్ సినిమా ముందు ప్రారంభమయ్యింది. దాంతో ఈ సినిమా లేట్ అయ్యింది. అంతేకానీ సినిమా ఆగిపోయిందనే వార్తల్లో నిజంలేదు అని అన్నారు.