Homeపొలిటికల్పవన్ వ్యూహం ఇదే.. అందరూ పాత్రధారులే !

పవన్ వ్యూహం ఇదే.. అందరూ పాత్రధారులే !

Pawans strategy is this.. Everyone is a role player

జనసేన ఏర్పాటు రోజు నుంచీ.. రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ ఏం చేసినా అదొక సంచలనమే. ఈ క్రమంలో ఎన్నో నిర్ణయాలు, మరెన్నో అనుభవాలు.. అన్నిటికీ మించి సైనికుల్లో కొందరు సేనాని పైనే అసంతృప్తి వ్యక్తం చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. కానీ.. పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఆయన పార్టీ వారికే అర్థం కాకపోతే ఎలా ?, ఎందుకు పవన్ నిర్ణయాలపై సొంత అభిమానుల్లోనే కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ?. పవన్ మంచోడే, కానీ పవన్ నిర్ణయం మాత్రం మంచిది కాదు అంటున్నారు. కానీ, అభిమానుల్లారా.. పవన్ ఏం చేసినా రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల బాగు కోసమే అనే విషయాన్ని నమ్మండి. ఒక యుద్ధ నీతి ఉంది. వ్యూహం ఎప్పుడూ నాయకుడికే వదిలి పెట్టాలి, అనుచరులు ఎప్పుడూ నాయకుడినే అనుసరించాలి. అవును, పవన్ కి పక్కా వ్యూహం ఉంది.

వచ్చే ఎన్నికల్లో వ్యతిరేకత ఓటు చీలనివ్వను అన్న దగ్గర నుంచే పవన్ కళ్యాణ్ తన వ్యూహాన్ని మొదలుపెట్టారు. అంతవరకు కాలు మీద కాలు వేసుకుని శుభ్రంగా నిద్రపోయిన ప్రభుత్వానికి.. ప్రభుత్వ ఎమ్మెల్యేలకు ఒక్కసారిగా చెమటలు పట్టాయి. పరుగులు పెట్టడం మొదలెట్టారు. లైవ్ లో చెప్పు చూపించి వాళ్లలోని రాక్షసత్వాన్ని పూర్తిగా బయటకు వచ్చేలా చేశారు. దెబ్బకు ఎమ్మెల్యేలంతా ప్రెస్ మీట్లు పెట్టారు. రాజకీయంగా పవన్ని విమర్శించడానికి ఏమీ లేదు కాబట్టి… వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. పైగా పవన్ చుట్టూ పద్మవ్యూహం రచించారు. కానీ ఆ పద్మవ్యూహంలో సీఎం బటన్ రెడ్డితో సహా అందరూ ఇరుక్కున్నారు.

సీఎం స్థాయి వ్యక్తి ఒక మంచి మనిషిని వ్యక్తిగతంగా ముఖ్యంగా పెళ్లిళ్ల గురించి, పెళ్ళాల గురించి మాట్లాడటం ఏంటి ? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించేలా అసహ్యించుకునేలా చేశారు పవన్. ఇన్నాళ్లు తన గురించి గానీ, తన పార్టీ గురించి గానీ ఎప్పుడూ పెద్దగా ఫోకస్ చేయని మీడియాను కూడా పవన్ తన వ్యూహంలో బంధించారు. మధ్యలో చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటూ అప్పుడప్పుడు ఆయన్ని కలుస్తూ పొత్తుల మీద క్లారిటీ ఇవ్వకుండా.. అసలు కలుస్తారో లేదో అని అయోమయంలో పడేసి… టీడీపీ మీడియాని కూడా తన చుట్టూ తిరిగేలా చేసుకున్నాడు పవన్. అన్నిటికీ మించి పవన్ ఎప్పుడు ఎక్కడ ఎవర్ని కలుస్తాడో అనే భయంతో జగన్ అండ్ అతని నాయకులు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్నాడు పవన్.

నిజానికి పవన్ – చంద్రబాబు కలుస్తారా ?, లేక, ఒంటరిగా వెళ్తారా ? అనేది ఎన్నికలకు ముందు మాత్రమే తెలుస్తోంది. కానీ.. ఈ లోపే తనను తాను కింగ్ మేకర్ ను చేసుకున్నాడు పవన్. దీంతో తెల్లారి లేస్తే పవన్ కళ్యాణ్ ఏం మట్టాడుతాడో..? ఎలా ఆలోచిస్తున్నాడో.. అసలు ఏం చేస్తాడో…? అని అయోమయంలో రెండు పార్టీలను పడేయడంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. మొత్తమ్మీద ఇప్పుడు మీడియా పవన్ మాటలు కోసం పడిగాపులు కాస్తోంది. కాబట్టి.. జనసైనికుల్లారా.. ఒకటి గుర్తుపెట్టుకోండి.. పవన్ ఆలోచనలతో విభేదిస్తే.. నష్టపోయేది మీరే. కాబట్టి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుండా…గుడ్డిగా పవన్ని ఫాలో అయిపోండి అంతే. ఎప్పుడైతే మీకు పార్టీ నిర్ణయమే శిరోధార్యం అవుతుందో.. అప్పుడే జనసేన అధికారంలోకి వస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu