HomeTelugu Trendingబన్నీ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ ఐటం సాంగ్‌!

బన్నీ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ ఐటం సాంగ్‌!

7 1
స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్‌లో అల్లు అర్జున్ రఫ్ లుక్ కేక పెట్టిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్యాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉండనుందట. మూమూలుగా సుకుమార్ సినిమాలో ఐటెమ్ సాంగ్స్ ఓ రెంజ్‌లో ఉంటాయి. అందులో భాగంగా ఈ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశాడట. అయితే ఈ పాటను మొదటినుండి ఓ బాలీవుడ్ భామపై చిత్రీకరించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం మేరకు హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu