HomeTelugu Trendingకమల్‌హాసన్ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ ఐటమ్‌ సాంగ్‌!

కమల్‌హాసన్ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ ఐటమ్‌ సాంగ్‌!

6 28స్టార్‌ హీరోయిన్లు కూడా ఐటెమ్‌ సాంగుల వైపు మొగ్గుచుపుతున్నారు. మంచి పారితోషికం ఆఫర్ చేయడం వల్ల చాలామంది వీటికి సై అంటున్నారు. పైగా మూడు నాలుగు రోజుల్లో ఈ పాట పూర్తయిపోతుంది. ఈ క్రమంలో ‘ఆర్ ఎక్స్ 100’ భామ పాయల్ రాజ్ పుత్ కి కూడా ఇలాంటిదే ఓ మంచి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రముఖ నటుడు కమల్‌హాసన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ ఆమెకు వచ్చింది. గతంలో తాను రూపొందించిన సూపర్ హిట్ చిత్రం ‘భారతీయుడు’కి ప్రముఖ దర్శకుడు శంకర్ ఇప్పుడు సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

కమలహాసన్ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత కొంత కాలంగా జరుగుతోంది. ఇందులో ఓ ఐటెమ్‌ సాంగ్‌ ఉండడంతో, దానికి పాయల్ ని తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే, పాయల్ కి కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుదన్నమాట..

Recent Articles English

Gallery

Recent Articles Telugu