Homeతెలుగు Newsప్చ్.. సౌత్ ఇండస్ట్రీ వరం పోయినట్టేనా !

ప్చ్.. సౌత్ ఇండస్ట్రీ వరం పోయినట్టేనా !

Pch.. Is the boon of South Industry gone

బాలీవుడ్ లో సౌత్ సినిమాలకు డిమాండ్ పెరగడానికి ముఖ్య కారణం బాయ్ కాట్ బాలీవుడ్ అనే ట్రెండే. నిజానికి ఈ ట్రెండ్ ఒక రకమైన బ్లాక్ మెయిల్. 2020 వ సంవత్సరంలో సుశాంత్ సింగ్ రాజపుత్ బలవన్మరణం తర్వాత, కొంతమంది (నిర్మాత కరణ్ జోహార్ , ఖాన్ ల త్రయం (సల్మాన్, షారుఖ్, అమీర్) ల పై వ్యతిరేకత ఉన్న వారంతా ఈ బాయ్ కాట్ బాలీవుడ్ నినాదాన్ని తలకెత్తుకున్నారు. సుశాంత్ సింగ్ రాజపుత్ కి అవకాశాలు రాకుండా చేసి, అతని మృతికి కరణ్ జోహార్ , ఖాన్ ల త్రయమే కారణం కనుక, ఈ కుళ్ళు బాలీవుడ్ స్టార్ల సినిమాలను బహిష్కరిస్తున్నాం అంటూ పెద్ద రాద్ధాంతమే చేశారు.

పైగా హిందీ సినిమాల్లో హింస, మితిమీరిన శృంగారం, డ్రగ్స్ వాడకం తప్ప ఏమీ లేవు కాబట్టి, ఆ నిర్మాత, ఖాన్ ల సినిమాలు ఆడనివ్వం అని సోషల్ మీడియాలో #boycottbollywood అని ట్రెండ్ ను వైరల్ చేశారు. అయితే యాదృచ్చికమో, బాలీవుడ్ వారి దురదృష్టమో తెలియదు కానీ, అప్పుడే దక్షిణాది సినిమాలైన బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్, పుష్ప , కాంతారా వంటి చిత్రాలు అక్కడ సూపర్ హిట్ అయ్యాయి. అయ్యాయి అనే దానికంటే.. #boycottbollywood ట్రెండ్ ఈ చిత్రాలకు బాగా కలిసి వచ్చింది. పైగా ఈ బాయ్ కాట్ గ్యాంగు వారు ‘దక్షిణాది చిత్రాలను చూడండి, రాజమౌళిని చూడండి, హిందూ మతాన్ని ఎంత గౌరవిస్తాడో, అని సౌత్ చిత్రాలకు హిందూ మతాన్ని ఆపాదించడం మొదలెట్టారు.

దాంతో, నార్త్ హిందువులు సౌత్ సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఇందులో భాగంగానే ఆమీర్ ఖాన్ ఎన్నో ఆశలు పెట్టుకుని తీసిన లాల్ సింగ్ చద్దాను కూడా అప్పుడు నార్త్ ప్రేక్షకులు చూడలేదు. ఆ సినిమా పరాజయంలో ఈ బాయ్ కాట్ బాలీవుడ్ వారు తమ పాత్ర ఉందని గొప్పగా చెప్పుకున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన మరొక పెద్ద ప్రాజెక్ట్ “బ్రహ్మస్త్ర” , రణబీర్ కపూర్ తాను బీఫ్ తిన్నాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు కనుక, బ్రహ్మస్త్ర ని బాయ్ కాట్ చేస్తున్నామహో అని మొదలెట్టారు ఈ గ్యాంగ్. చావుతప్పి కన్ను లొట్ట పోయినట్టు, సినిమా మరీ ప్లాప్ కాకుండా రణబీర్ కపూర్ – అయాన్ ముఖర్జీ పరువు నిలబెట్టింది.

ఈ ఏడాది మొదట్లో విడుదలైన షారుఖ్ ఖాన్ పఠాన్ పై ఈ బాయ్ కాట్ గ్యాంగ్ పెద్ద యుద్ధమే చేసింది. అసలే షారుఖ్ కి దాదాపుగా ఒక దశాబ్దంగా హిట్ లేదంటే, మేము షారుఖ్ సినిమాని బాయ్ కాట్ చేస్తున్నాం, భారతీయుడై ఉండి పఠాన్ అని పేరు పెట్టుకోవడం ఏమిటి ? అని చిత్ర విచిత్ర కారణాలతో సినిమాని ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేశారు. ఇక ఒక రాష్ట్ర మంత్రి గారైతే ఒక అడుగు ముందుకేసి దీపికా బికినీలో రంగు, దేశాన్ని అవమానించడమే అని కొత్త పల్లవి అందుకున్నారు.

కానీ, సినిమా సూపర్ హిట్ అయ్యింది. దెబ్బకు ‘బాయ్ కాట్ గ్యాంగ్’ ఉనికికి ఇప్పుడు పెద్ద దెబ్బే పడింది. మళ్లీ.. బాలీవుడ్ ఒక్కటి అయ్యింది. కానీ, ఈ బాయ్ కాట్ గ్యాంగ్ బాలీవుడ్ కి దరిద్రం గానీ, సౌత్ ఇండస్ట్రీకి మాత్రం వరం. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ వరం తన ప్రభావాన్ని కోల్పోయిందనే చెప్పుకోవచ్చు. ఇది సౌత్ సినిమాలకు తీరని నష్టం కూడా.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu