HomeTelugu Trending'ఆర్‌ఆర్‌ఆర్‌' రైట్స్ దక్కించుకున్న పెన్‌ స్టూడియోస్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రైట్స్ దక్కించుకున్న పెన్‌ స్టూడియోస్‌

Pen india acquires all in o

రాజమౌళి డైరెక్షన్‌ లో వస్తున్న భారీ బడ్జెట్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌. అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న ఈ సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌ చణ్‌లు నటిస్తున్నారు. హాలీవుడ్‌ నటీ ఒలివియా మోరీస్, బాలీవుడ్‌ నటి అలియా భట్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ దాదాపు ఓ ఎనిమిది నెలలు వాయిదా పడింది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. కాగా ఈ సినిమా రైట్స్ కోసం నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకున్నట్టుగా ప్రకటించింది ఆర్ ఆర్ ఆర్ టీమ్.

ఇక్కడ విశేషమేమంటే.. ఇండియాలో ఏ సినిమాకు దక్కని భారీ ధర ఆర్ఆర్ఆర్‌ దక్కించుకుందని సమాచారం. ఈ పెన్ స్టూడియోస్ ప్రస్తుతం తెలుగులో మాస్ మహారాజ్ రవితేజతో లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “ఖిలాడి” సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదే పెన్ మూవీస్ తెలుగు చత్రపతిని హిందీలో బెల్లంకొండ హీరోగా రీమేక్ చేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu