HomeTelugu Trendingబాలీవుడ్ హీరోకి మోడీ ఫన్నీ రిప్లై.. వైరల్‌

బాలీవుడ్ హీరోకి మోడీ ఫన్నీ రిప్లై.. వైరల్‌

10 16బాలీవుడ్ యంగ్‌ హీరో కార్తిక్‌ ఆర్యన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఫన్నీ రిప్లై సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇటీవల ముంబయిలో నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఇండియన్‌ సినిమాను మోడీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్‌కు చెందిన ఎందరో సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. అయితే ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు ఇంతియాజ్‌ అలీ.. కార్తిక్‌ ఆర్యన్‌, కరణ్‌ జోహార్‌తో కలిసి దిగిన సెల్ఫీని కార్తిక్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సెల్ఫీ సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది.

ఎందుకంటే.. వీరు సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో మోడీ వారి వెనక నిలబడి ఉన్నారు. ఈ ఫొటోకు ..’లూజర్స్‌ వెనక గౌరవనీయ ప్రధాని’ అని క్యాప్షన్‌ ఇచ్చారు కార్తిక్‌. దీనిపై మోడీ స్పందిస్తూ.. ‘మీరు లూజర్స్‌ కాదు రాక్‌స్టార్స్‌. ‘జబ్‌ వి మెట్‌’ (మనం కలిసినప్పుడు) సెల్ఫీ తీసుకోలేకపోయాం. కానీ మున్ముందు మరో వేడుక ఉండనే ఉంటుంది’ అని చమత్కరించారు మోడీ. ఇంతియాజ్‌ అలీ దర్శకత్వం వహించిన ‘జబ్‌ వి మెట్‌’ సినిమా గురించి మోడీ ట్వీట్‌లో ప్రస్తావించడం వైరల్‌గా మారింది.

10a

ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్‌ కమెడియన్‌ కపిల్‌ శర్మ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీతో కలిసి దిగిన ఫొటోను కపిల్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘మోడీ జీ.. మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది. సినీ పరిశ్రమ గురించి మన దేశం గురించి మీరు ఇచ్చిన సలహాలు ఎంతో స్ఫూర్తిదాయకం. మరో విషయం ఏంటంటే.. మీకు మంచి హాస్య చతురత ఉంది’ అని పేర్కొన్నారు. ఇందుకు మోడీ ప్రతి స్పందిస్తూ.. ‘కపిల్‌ శర్మ మరొకరి హాస్యచతురత గురించి పొగిడినప్పుడు తప్పకుండా సదరు వ్యక్తి ఎంతో సంతోషిస్తాడు. ఇందుకు నేను మినహాయింపు కాను’ అని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu