HomeTelugu Trendingగృహహింస కేసులో 'ఖుషి' హీరోయిన్‌

గృహహింస కేసులో ‘ఖుషి’ హీరోయిన్‌

Police case filed on actres

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ కెరీర్‌లో ‘ఖుషి’ సినిమా బిగెస్ట్‌ హిట్‌గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంతో భూమిక హీరోయిన్ గా నటించింది. సెకండ్ హీరోయిన్ గా ముంతాజ్ నటించి మెప్పించింది. తెలుగులో పలు సినిమాల్లో పలు ఐటెం సాంగులు చేసిన ముంతాజ్… తమిళంలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. తాజాగా ఆమెపై గృహహింస కేసు నమోదయింది. అన్నా నగర్‌లో నివసిస్తున్నఆమె తన ఇంట్లో ఆరేళ్లుగా ఉత్తరాది రాష్ట్రానికి చెందిన మైనర్‌ బాలికలు పని చేస్తున్నారు. మంగళవారం అనూహ్యంగా బాలికల్లో ఒకరు అన్నానగర్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి తాము సొంత ఊరుకు వెళ్లిపోవాలనుకుంటున్నట్లు, అయితే ఇంటి యజమానురాలు అనుమతి ఇవ్వటం లేదని, హింసిస్తున్నారని చెప్పింది.

అన్నానగర్‌ పోలీసులు ఆ బాలిక ఉన్న ప్రాంతానికి వెళ్లి తనతో పాటు ముంతాజ్‌ ఇంటిలో మరో బాలికను చెన్నైలోని బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. బుధవారం బాలల సంరక్షణ కేంద్రం అధికారి శాలిని ఆ ఇద్దరి నుంచి వివరాలు సేకరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu