HomeTelugu Trendingరాజ్‌ తరుణ్‌ సినిమాపై పోలీసులు కేసు

రాజ్‌ తరుణ్‌ సినిమాపై పోలీసులు కేసు

Police case filed on Raj Ta
లాక్‌డౌన్ తరువాత వాయిదా పడిన సినిమా షూటింగులు తిరిగి ప్రారంభమౌతున్నాయి. సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చిన కొన్ని సినిమాలు మాత్రమే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ లు చేస్తున్నారు. కొన్ని సినిమాల షూటింగులు ఇంకా ప్రారంభం కాలేదు. గతంలో పబ్లిక్ ప్లేస్ లో అనుమతులు తీసుకొని షూటింగ్ లు చేసుకునే అవకాశం ఉండేది. అయితే కరోనా కారణంగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్టూడియోలలో మాత్రమే షూటింగ్స్‌ జరుగుతున్నాయి. ఒకవేళ పబ్లిక్ ప్లేస్‌లో షూటింగ్ చేయాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సిందే. అయితే, టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కొత్త సినిమా షూటింగ్ ఉప్పల్ లోని బ్యాంకు కాలనీలోని ఓ పబ్లిక్ ప్లేస్ లో జరుగుతున్నది. అయితే, ఉప్పల్ లోని బ్యాంకు కాలనీలో షూటింగ్ చేసేందుకు ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. షూటింగ్స్‌కు అనుమతులు తీసుకోకపోవడంతో వనమాలి క్రియేషన్స్ ప్రొడక్షన్ మేనేజర్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు.

మెహ్రీన్‌ తో క్లాప్‌బోర్డు ఇంటర్య్వూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu