HomeTelugu Trendingపవన్‌తో రొమాన్స్‌ చేయనున్న పూజహెగ్డే..

పవన్‌తో రొమాన్స్‌ చేయనున్న పూజహెగ్డే..

Pooja hegde with pawan kal
హీరోయిన్‌ పూజ హెగ్డే నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో..తెలుగులో మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి ఈ అమ్మడికి. ఇప్పటికే అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో పాటు, ప్రభాస్ పక్కన ‘రాధే శ్యామ్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ కు జోడీగా నటించే ఛాన్స్ కూడా ఈ ముద్దుగుమ్మకు వచ్చినట్టు తెలుస్తోంది.

గతంలో పవన్ కల్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ మరో చిత్రాన్ని చేయనున్నాడు. హరీశ్ చెప్పిన కథకు పవన్ ఇప్పటికే ఓకే చెప్పేశాడు. దీంతో ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఈ బుట్టబొమ్మను తీసుకోవాలని దర్శకుడు హరీశ్ భావిస్తున్నాడట. దాంతో ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దాదాపు ఆమె ఎంపిక పూర్తయినట్టేనని టాక్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu