HomeTelugu Trending'గుంటూరు కారం' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ షిప్ట్‌.. ఎక్కడ ఎప్పుడంటే!

‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ షిప్ట్‌.. ఎక్కడ ఎప్పుడంటే!

Guntur kaaram 1

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు -టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా (జ‌న‌వ‌రి12)న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా.. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది.

ఈ నేపధ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో భారీ ఎత్తున్న ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. గ‌త శుక్రవారం ఈ ప్రీ రిలీజ్ వేడుక‌ను వాయిదా వేస్తున్న‌ట్లు మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించారు. అయితే తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు.

Guntur kaaram movie pre rel

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌ను జ‌న‌వ‌రి 09న గుంటూరులోని నంబూరు ఎక్స్ రోడ్స్, భరత్ పెట్రోల్ బంక్ పక్కన నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక ఈ విష‌యం తెలుసుకున్న మ‌హేష్ ఫ్యాన్స్ గుంటూరు ప‌య‌న‌మవుతున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu