HomeTelugu Trendingఆ హీరో అంటే ఇష్టం: పూజా హెగ్డే

ఆ హీరో అంటే ఇష్టం: పూజా హెగ్డే

5 25టాలీవుడ్ లో పూజా హెగ్డే టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్నది. మెగా హీరో వరుణ్ తేజ్‌ నటించిన ‘ముకుందా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ‘డీజే’ మూవీ వరకు పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు. డీజే తరువాతనే ఆమెకు అవకాశం కలిసి వచ్చింది. డీజే సినిమా భారీ హిట్ అందుకుంది. డీజే హిట్ కావడంతో ఆమెకు వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అరవింద సమేత సినిమాతో అఫర్ వచ్చింది.

ఈ మూవీ భారీ విజయం సొంతం చేసుకుంది. ఆ వెంటనే చేసిన మహర్షి సినిమా కూడా హిట్ అయ్యింది. కాగా, ఇప్పుడు ప్రభాస్ తో జాన్ సినిమా చేస్తున్నది. ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆమెను ఓ ప్రశ్న అడిగారు. మీకు ఇష్టమైన హీరో ఎవరు అంటే ప్రభాస్ అని చెప్పేసింది. ప్రభాస్ తో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉన్నట్టు ఆమె చెప్పింది. జాన్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నది. ఇప్పటికే సినిమా దాదాపుగా 30శాతం పూర్తయింది. సమ్మర్ వరకు సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu