HomeTelugu Newsరొటీన్ కు భిన్నంగా ఉండే సినిమా!

రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమా!

“ఇప్పటివరకు నేను చాలా సినిమాల్లో నటించాను, వాటిలో కొన్ని సూపర్ హిట్ కూడా అయ్యాయి. కానీ.. ఓ నటిగా ఇప్పటివరకు నాకు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇఛ్చిన చిత్రం పేరు చెప్పమంటే మాత్రం కచ్చితంగా “జయమ్ము నిశ్చయమ్మురా” పేరు చెబుతాను” అన్నారు టాలెంటెడ్ హీరోయిన్ పూర్ణ.
సతీష్ కనుమూరితో కలిసి స్వీయ నిర్మాణంలో శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో పూర్ణ హీరోయిన్ గా నటించిన “జయమ్ము నిశ్చయమ్మురా” ఈనెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా పూర్ణ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
శివరాజ్ కనుమూరితో పని చేస్తున్నప్పుడు ఒక కొత్త దర్శకుడితో పని చేసిన ఫీలింగ్ ఎప్పుడూ తనకు కలగలేదని, ఒక లెజెండరీ డైరెక్టర్ తో పని చేస్తున్న ఫీలింగ్ కలిగిందని ఈ సందర్భంగా పూర్ణ పేర్కొన్నారు. ఈ సినిమా ప్రపోజల్ తన దగ్గరకు వచ్చినప్పుడు.. చాలా మంది చాలా రకాలుగా చెప్పారని, కానీ శివరాజ్ చెప్పిన స్టోరీ విన్నాక, ఈ సినిమాకు సంతకం చేయకుండా ఉండలేకపోయానని ఆమె అన్నారు. వేరే వాళ్ళ మాటలు విని ఈ సినిమా చేసి ఉండకపోతే.. ఒక గొప్ప సినిమాను మిస్సయ్యిపోయి ఉండేదాన్నని పూర్ణ చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి వంటి టేలెంటెడ్ యాక్టర్ తో పని చేయడం కూడా తనకు మంచి అనుభూతిని ఇచ్చిందని ఆమె అన్నారు. “జయమ్ము నిశ్చయమ్మురా” వంటి గొప్ప సినిమా చేసినందుకు జీవితాంతం గర్వపడతానని, ఇందుకుగాను దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పూర్ణ అన్నారు. విడుదలకు ముందే ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. కేరళ నుంచి వఛ్చిన తనకు.. ఇప్పటివరకు తమ కేరళ చాల అందమైన రాష్ట్రమనే చిన్న అహంకారం మనసులో ఉండేదని.. కానీ “జయమ్ము నిశ్చయమ్మురా” చిత్రం కోసం ఆంధ్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ చేసాక.. కేరళలోని అందాల కంటే గొప్ప ప్రకృతి అందాలు ఇక్కడ ఉన్నాయని తెలుసుకున్నానని ఆమె తెలిపారు. ఇప్పుడొస్తున్న రొటీన్ సినిమాలకు భిన్నంగా.. భారతీరాజా, భాగ్యరాజా, జంధ్యాల, వంశీ వంటి గొప్ప దర్శకులు తీసిన సినిమాల తరహాలో రూపొందిన “జయమ్ము నిశ్చయమ్మురా” చిత్రాన్ని ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడాలని పూర్ణ అన్నారు. ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ పూర్ణ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు!!

[ngg_images source=”galleries” container_ids=”1″ display_type=”photocrati-nextgen_basic_thumbnails” override_thumbnail_settings=”0″ thumbnail_width=”240″ thumbnail_height=”160″ thumbnail_crop=”1″ images_per_page=”20″ number_of_columns=”0″ ajax_pagination=”0″ show_all_in_lightbox=”0″ use_imagebrowser_effect=”0″ show_slideshow_link=”1″ slideshow_link_text=”[Show slideshow]” order_by=”sortorder” order_direction=”ASC” returns=”included” maximum_entity_count=”500″]

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!