పల్లెటూరుకి వస్తున్న మహేష్‌బాబు!

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. ఈ సినిమా యూఎస్ షెడ్యూల్ ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చింది. ఈ సినిమాలో మహేష్ వివిధ షేడ్స్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. యుఎస్ లో ఓ బిజినెస్ మెన్ గా కనిపిస్తున్న మహేష్, స్టూడెంట్ పాత్రలో కూడా అలరించబోతున్నాడు. యూఎస్ నుంచి ఇండియాకు వచ్చిన మహేష్ పల్లెటూరిలో తన స్నేహితుడు అల్లరి నరేష్ కోసం వస్తాడట. ఎక్కువ భాగం సినిమా ఈ పల్లెటూరిలోనే జరుగుతుందని.. దానికి సంబంధించిన షూటింగ్ దీపావళి తరువాత స్టార్ట్ అవుతుందని తెలుస్తున్నది.

పల్లెటూరి సెట్ ను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. సహజసిద్దంగా పల్లెటూరు ఎలా ఉంటుందో అలాగే సెట్ ను నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం పల్లెటూరి చుట్టూనే సినిమా నడుస్తుంది. మహేష్ కు నరేష్ కు ఉన్న సంబంధం ఏంటి. అమెరికాలో మహేష్ ఇండియాలోని ఆ పల్లెటూరుకు ఎందుకు వచ్చాడు అన్నది కథ. ఈ చిత్రంలో పూజా హెగ్డే మహేష్‌ బాబుకు జంటగా నటిస్తుంది. పూజా పాత్ర ఏంటి అనే విషయం ఇప్పటివరకు రివీల్ కాలేదు. జనవరి వరకు షూటింగ్ పూర్తి చేసి, సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 5 న సినిమాను విడుదల చేసేందుకు వంశీ పైడిపల్లి ప్లాన్ చేస్తున్నాడు.