HomeTelugu Trendingప్రభాస్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఫస్ట్‌లుక్‌ డేట్‌ ఫిక్స్‌

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఫస్ట్‌లుక్‌ డేట్‌ ఫిక్స్‌

1 6
యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇది ప్రభాస్‌కు 20వ సినిమా. ‘రాధే శ్యామ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ భారీ చిత్రానికి సంబంధించి అప్‌డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగాఎదురుచూస్తున్నారు. జులై 10 ఉదయం 10 గంటలకు ప్రభాస్ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ విడుదల చేయనున్నారు. తాజాగా ఈ విషయం పై చిత్రం బృందం ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ఈ పోస్టర్ ను ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్‌ చేశారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిఆమ తెలుగు తమిళ్, హిందీ , మలయాళ భాషల్లో విడుదల కానుంది. ‘సాహో’ తరవాత వస్తోన్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu