HomeTelugu Trendingతల్లి కాబోతున్న బిగ్‌బాస్‌ బ్యూటీ

తల్లి కాబోతున్న బిగ్‌బాస్‌ బ్యూటీ

Bigg Boss fame hari teja go
బిగ్ బాస్ ఫేమ్ హరితేజ తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఒక వీడియో పోస్ట్ చేసింది. లాక్‌డౌన్ నేపథ్యంలో కొన్ని నెలలుగా ఆమె షూటింగులకు దూరంగా ఉంది. మొదటిగా సీరియల్స్ ద్వారా పరిచయమైన ఈమె బిగ్‌బాస్‌తో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. అనంతరం బుల్లితెరపై తన యాంకరింగ్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమాలలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్యారక్టర్ నటిగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. నాలుగేళ్ల క్రితం దీపక్ రావు అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది. మీకు మీ అంత అందమైన బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నాం అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అలాగే తనకు కంగ్రాట్స్ చెప్పిన వాళ్ళందరికీ హరితేజ కూడా తిరిగి కృతజ్ఞతలు చెబుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu