HomeTelugu Trendingప్రభాస్‌ 20వ చిత్రం టైటిల్‌ ఫిక్స్‌..!

ప్రభాస్‌ 20వ చిత్రం టైటిల్‌ ఫిక్స్‌..!

1 18
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌.. ‘సాహో’ సినిమా తరవాత మరోసారి పూజా హెగ్డే కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ డైరెక్షన్‌లో వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటికే కొంతవరకు పూర్తి చేశారు. కాగా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే ఈ చిత్రానికి ‘రాధేశ్యామ్’ అనే టైటిల్ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. ఇది ప్రభాస్ కు 20వ చిత్రం. ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారంటూ ట్రేడ్ అనలిస్ట్ శివ సత్యం తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు ‘రాధేశ్యామ్’ అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu