HomeTelugu Trendingప్రభాస్‌ కొత్త సినిమా రిలీజ్‌ అప్పుడేనట!

ప్రభాస్‌ కొత్త సినిమా రిలీజ్‌ అప్పుడేనట!

7 25
యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్.. జిల్ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా అందాల భామ పూజ హెగ్డే నటిస్తుంది. ఇక ఈ సినిమాకు ‘రాధేశ్యామ్ ‘అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమా బ్యూటీఫుల్ లవ్ స్ట్రోరీగా తెరకెక్కనుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 16 న విడుదల చేసేందుకు నిర్మాతలు డేట్ లాక్ చేశారని సమాచారం. అంటే ఈ ఏడాది దసరా సీజన్ కు ‘ప్రభాస్ 20’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్.. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu