HomeTelugu Trending'ఆదిపురుష్‌'లో కిచ్చా సుదీప్‌!

‘ఆదిపురుష్‌’లో కిచ్చా సుదీప్‌!

kiccha sudeep in adipurush

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను టీ-సిరీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో సుదీప్ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడట. ప్రభాస్‌ రాముడి పాత్రలో, బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ఎంపిక అయ్యారు.

లంకాధిపతి రావణాసురుడి సోదరుడు విభీషణుడి పాత్రలో కిచ్చా సుదీప్ కనిపిస్తాడట. సుదీప్ గతంలో ‘బాహుబలి’లోనూ అతిథి పాత్రలో కనిపించాడు. 3డీలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుండటం విశేషం. ముంబైలో ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. నిజానికి ‘ఆదిపురుష్’ను 2022 ఆగస్టు 11న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu