HomeTelugu Trendingప్రభాస్‌ 20వ మూవీ టైటిల్‌-ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

ప్రభాస్‌ 20వ మూవీ టైటిల్‌-ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

1a 5

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. డార్లింగ్‌ 20వ సినిమా ఫస్ట్‌లుక్ వచ్చేసింది. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాకు ముందుగా అనుకున్నట్లుగానే ‘రాధే శ్యామ్’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్‌లో ప్రభాస్, పూజా ఒకరిని ఒకరు దగ్గరగా పట్టుకొని ఉన్నారు. ఇక పూజా హెగ్డే డ్రెస్ నుండి ఓ సముద్రాన్ని తలపించే విధంగా పోస్టర్ కనిపిస్తుంది. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. తెలుగు, తమిళ్, హిందీ , మళయాళ భాషల్లో ఈ పోస్టర్‌ ను విడుదల చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu