HomeTelugu Trendingశ్యామ్‌ సింగరాయ్‌ ట్రైలర్‌

శ్యామ్‌ సింగరాయ్‌ ట్రైలర్‌

Shyam Singha Roy movieTrail
నేచురల్‌ స్టార్‌ నాని ద్విపాత్రాభినయంలో నటిస్తున్న పవర్‌ఫుల్‌ మూవీ ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం వరంగల్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించింది. ఇందులో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేసింది. నాని అభిమానులు కోరుకునే అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉన్నట్టు ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది.

టైటిల్‌ పాత్రలో నాని ఒదిగిన తీరు విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆయన చెప్పిన ప్రతి డైలాగ్‌ చప్పట్లు కొట్టించేలా ఉంది. సాయి పల్లవి ఈ సినిమాలో దేవదాసిగా నటిస్తుంది. ముగ్గురు నాయికలు ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 1970ల కాలం నాటి కథతో కోల్‌కతా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu