HomeTelugu Trendingప్రభాస్‌- మారుతి మూవీ టైటిల్‌ ఇదేనా!

ప్రభాస్‌- మారుతి మూవీ టైటిల్‌ ఇదేనా!

Prabhas and maruthi movie l

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్ర నిర్మాణసంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కార్యాలయంలో పూజా కార్యక్రమాల జరిగాయి. ఇటలీలో ఉండటంవల్ల ప్రభాస్‌ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనలేదు.

హారర్‌–కామెడీ జానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించ నున్నారని, ‘రాజా డీలక్స్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్‌ ప్రస్తుతం ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాగే ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌’ మూవీ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఇక ‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ చిత్రం చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu