HomeTelugu Trending'త‌న్హాజీ' డైరెక్ట‌ర్‌ తో ప్రభాస్‌ మూవీ

‘త‌న్హాజీ’ డైరెక్ట‌ర్‌ తో ప్రభాస్‌ మూవీ

3 3యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రేంజ్‌ బాహుబ‌లి సినిమా త‌ర్వాత ఓ స్థాయిలో పెరిగిపోయింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ త‌న 20వ సినిమా ‘రాధేశ్యామ్’ తో బీజీగా ఉన్నాడు. వ‌చ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా వ‌చ్చే ఏడాది ప్ర‌భాస్ మ‌హాన‌టి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేయ‌నున్నాడు. భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్క‌బోతుంది.

అయితే ‘బాహుబ‌లి’ సినిమాతో త‌ర్వాత ప‌లువ‌రు బాలీవుడ్ ద‌ర్శ‌కులు, నిర్మాతలు బాలీవుడ్ మూవీ చేయాల‌ని ప్ర‌భాస్‌ ని సంప్రాదించినప్పటికీ.. అప్ప‌ట్లో ప్ర‌భాస్ ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ప్ర‌భాస్ టీ సిరీస్‌లో ఓ సినిమా చేయ‌బోతున్నట్లు తెలుస్తోంది. ‘త‌న్హాజీ’ డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఛారిత్రాత్మక నేపథ్యంలో సినిమాను చేయాలని భావిస్తున్నారట. యూవీ క్రియేషన్స్ వారు బాలీవుడ్ ఫేమస్ నిర్మాణ సంస్థతో కలిసి ప్రభాస్ బాలీవుడ్ సినిమాను నిర్మించబోతున్నారట. 2022 చివర్లో ఈ ఛారిత్రాత్మక చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu