కేరళ వరదలపై సినిమా..’2043 ఫీట్’..!

గత కొన్ని రోజుల క్రితం కేరళను వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కేరళకు అండగా దేశం మొత్తం నిలబడింది. ఈ విషాద ఘటన నుండి కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా ఈ ఉదంతం మీద సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు మలయాళీ దర్శకుడు జూడ్ ఆంటోనీ జోసెఫ్.

ఈ వరదల మీద స్ఫూర్తిదాయంగా ఏదైనా వీడియో చేయమని స్వచ్ఛంద సంస్థలు అడగ్గా ఈ ఆలోచన వచ్చిందన్న జూడ్ ఆంటోనీ జోసెఫ్ ప్రేరణ కలిగించేలా ఈ సినిమాను రూపొందించనున్నాను, కేరళకు సహాయం చేసిన ప్రతి ఒక్కరు ఈ చిత్రంలో హీరోలే అన్నారు. అంతేగాక చిత్రానికి ‘2043 ఫీట్’ అనే పేరును కూడ నిర్ణయించారు.