HomeTelugu Trendingఅమెరికా ప్రారంభమైన 'ప్రాజెక్ట్‌ కే' సందడి

అమెరికా ప్రారంభమైన ‘ప్రాజెక్ట్‌ కే’ సందడి

prabhas fans car rally in u
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రాజెక్ట్ కే’. ఈ నెల 20న అమెరికాలోని శాన్ డియాగోలో ఈ సినిమా టైటిల్ తో పాటు, గ్లింప్స్ ను కూడా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో అమెరికాలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ భారీ కార్ల ర్యాలీతో సందడి చేశారు. యూఎస్ లోని సెయింట్ లూయిస్, మిస్సోరి రాష్ట్రాలకు చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ ఒక చోటుకు చేరి కార్ల ర్యాలీ నిర్వహించారు.

ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రూ. వెయ్యి కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుండి దీపిక ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమలహాసన్ వంటి దిగ్గజాలు నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu