మరోసారి ప్రభాస్‌కు జోడిగా కాజల్‌


యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌- బ్యూటీ క్వీన్‌ కాజల్‌ జోడీకి టాలీవుడ్‌లో ఓ క్రేజ్‌ ఉంది. వీరిద్దరు జంటగా నటించిన ‘డార్లింగ్’, ‘మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. తాజాగా ఈ జంట మరోసారి వెండితెరపై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదొక వింటేజ్‌ లవ్‌స్టోరీ. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఇందులో పూజా హెగ్డేతో పాటు కాజల్‌ కూడా నటించనున్నారట. కాజల్‌ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని వినికిడి. పునర్జన్మల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని కీలక సన్నివేశాల్లో ప్రభాస్‌ సరసన కాజల్‌ దర్శనమివ్వబోతున్నారని టాలీవుడ్‌ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. దీనిపై ఇంకా చిత్రబృందం నుంచి అధికారి ప్రకటన వెలువడలేదు.

CLICK HERE!! For the aha Latest Updates