HomeTelugu Trendingథియేటర్ లో ఎగిరి గంతులు వేస్తున్నారు.. వీడియో షేర్‌ చేసిన పూజా హెగ్డే

థియేటర్ లో ఎగిరి గంతులు వేస్తున్నారు.. వీడియో షేర్‌ చేసిన పూజా హెగ్డే

2 21శోభన్ బాబు, శ్రీదేవిలు నటించిన ‘దేవత’ చిత్రంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీసిన ‘ఎల్లువొచ్చి గోదారమ్మ…’ పాటను అదే స్టయిల్ లో హరీశ్ శంకర్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ‘గద్దెలకొండ గణేష్’ కోసం వరుణ్ తేజ్, పూజా హెగ్డేలపై ఈ పాటను తీశారు. ఇక దీనికి థియేటర్ లో ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. సినీ అభిమానులు ఈ పాట వచ్చినప్పుడు ఎగిరి గంతులేస్తున్నారు.

ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన పూజా హెగ్డే, “ఇందుకోసమే నేను మైళ్లకు మైళ్లు వెళుతుంటాను. ఇటువంటి దృశ్యాలు చూస్తే, బాధలన్నీ మరచిపోతాం. మీ ఆనందం, థియేటర్లలో ఇలా నృత్యం చేయడం చూసి, మేము నిద్రలేని రాత్రులను, ప్రయాణాన్ని, ఎండలో నిలబ‌డి సినిమాలు చేయ‌డాన్ని… వీటన్నింటినీ మీ ప్రేమ ముందు మ‌రిచిపోతాం. ఎల్లువొచ్చి గోదారామ్మ ల‌వ్ యూ” అని కామెంట్ పెట్టింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu