HomeTelugu Trendingప్రభాస్ సలార్ ట్రైలర్‌పై అప్డేట్

ప్రభాస్ సలార్ ట్రైలర్‌పై అప్డేట్

Salaar trailer update
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజా చిత్రం సలార్. పార్ట్ 1 సీజ్‍ఫైర్ కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

సలార్ గురించి సరైన అప్‍డేడ్స్ ఇవ్వకపోవటంతో మూవీ యూనిట్‍పై ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సలార్ పార్ట్ 1 ట్రైలర్ త్వరలో రిలీజ్ చేస్తున్నామంటూ అప్‍డేట్ ఇచ్చారు.

ఈ విషయాన్ని మూవీ నిర్మాణ సంస్థ హొంబాలే ఫిల్మ్స్ ప్రకటించింది. యూట్యూబ్‍లో ఓ షార్ట్ వీడియోను అప్‍లోడ్ చేసింది. కొన్ని యాక్షన్ విజువల్స్‌లో వీడియోను పోస్ట్ చేసింది.

ట్రైలర్ రిలీజ్ డేట్‍ను మాత్రం ప్రకటించలేదు. ఈ సినిమా ట్రైలర్ ఈనెలాఖరున లేకపోతే సెప్టెంబర్ తొలి వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో మూడు రోజుల్లో ట్రైలర్ రిలీజ్ డేట్‍ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

https://www.youtube.com/shorts/7mhbXYuac-k?t=39&feature=share

సలార్ సీజ్‍ఫైర్ మూవీ రిలీజ్ దగ్గరపడుతోందని, అప్‍డేట్లు ఇవ్వాలని మూవీ యూనిట్‍ను ప్రభాస్ అభిమానులు కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. సలార్ సీజ్‍ఫైర్ నుంచి ముందుగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందని అన్నారు. నేరుగా ట్రైలర్ రిలీజ్ చేసేందుకే మేకర్స్ సిద్ధమయ్యారు.

సలార్ సినిమాలో ప్రభాస్‍కు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషించారు. టిన్నూ ఆనంద్, జగపతిబాబు, ఈశ్వరిరావు, శ్రీయారెడ్డి, రామచంద్రరాజు కీలకపాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 28న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సలార్ పార్ట్ 1 సీజ్‍ఫైర్ రిలీజ్ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu