HomeTelugu Trendingకనుమరుగవనున్న బ్యాలెట్ పత్రాలు

కనుమరుగవనున్న బ్యాలెట్ పత్రాలు

4a
బ్యాలెట్ పేపర్ల వాడకంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత నిచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సహా 23 రాజకీయ పార్టీలు ఈవీఎంలు వద్దని.. బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరపాలని సీఈసీని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈసీ మాత్రం ఈవీఎంల ద్వారానే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్ అరోరా ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర అధికారులతో, రాజకీయ నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని, కొన్ని రాజకీయ పార్టీల నేతలు బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరారని, అది సాధ్యం కాదని చెప్పామని, ఈవీఎంలు సరిగ్గా పని చేయకపోవచ్చునేమో కాని, వాటిని ట్యాంపర్‌ చేయడం మాత్రం సాధ్యం కాదని
ఆయన స్పష్టం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu