HomeTelugu Big Storiesమరో బాలీవుడ్‌ డైరెక్టర్‌ని లైన్‌ లో పెట్టిన ప్రభాస్‌!

మరో బాలీవుడ్‌ డైరెక్టర్‌ని లైన్‌ లో పెట్టిన ప్రభాస్‌!

Prabhas movie with Bollywoo
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాతో బీజీగా ఉన్నాడు. తాజాగా ‘రాధే శ్యామ్’ సినిమా పూర్తి చేసిన ప్రభాస్‌ మరో మూడు చిత్రాలను లైన్‌లో పెట్టాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’లతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ చిత్రంలోనూ నటిస్తున్నాడు. వీటిలో ప్రస్తుతం ‘సలార్’, ‘ఆదిపురుష్’ సెట్స్ మీద వున్నాయి.

‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ చిత్రాలను రూపొందించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. ఈ ప్రాజక్టుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని, వీరి కలయికలో ఓ భారీ యాక్షన్ సినిమా తెరకెక్కనుందని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సిద్ధార్థ్ హిందీలో షారుఖ్, హృతిక్ సినిమాలు సినిమా చేస్తున్నాడు. ఇక ప్రభాస్, సిద్ధార్థ్ ప్రస్తుత కమిట్ మెంట్స్ పూర్తయ్యాక వీరి కాంబోలో సినిమా మొదలవుతుందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu