HomeTelugu Big Storiesరివ్యూ: పటేల్ సర్

రివ్యూ: పటేల్ సర్

నటీనటులు: జగపతిబాబు, తాన్య హోప్, పద్మప్రియ జానకిరామన్,
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు
సంగీతం: డిజె వసంత్
నిర్మాత: సాయి కొర్రపాటి
దర్శకత్వం: వాసు పరిమి
విలన్ గా సినిమాలు చేస్తోన్న జగపతిబాబు.. వాసు పరిమి అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో మరో సారి హీరోగా మారి ‘పటేల్ సర్’ అనే సినిమాలో నటించాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో.. సమీక్షలోకి
వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
పటేల్(జగపతిబాబు) డ్రగ్స్ మాఫియాకు సంబంధించిన డి.ఆర్(కబీర్ దుహన్ సింగ్)ను అతడి అనుచరులను చంపాలని చూస్తుంటాడు. డి.ఆర్ అనుచరులను ఒక్కొక్కరిగా టార్గెట్ చేసి చంపుతుంటాడు. అతడితో పాటు ఓ పదేళ్ళ చిన్న పాప కూడా ఉంటుంది. పటేల్ ఆ పాపను ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాడు. అలానే తను పగబట్టిన వాళ్ళను హత్యలు చేస్తుంటాడు. అసలు పటేల్ కు వారిని హత్య చేయాల్సిన అవసరం ఏముంది..? అరవై ఏళ్ళ ముసలివాడైన పటేల్ కు పగ ఏంటి..? ఆ హత్యలు చేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటి..? పటేల్ తో ఉన్న చిన్నారి అతడికి ఏమవుతుంది..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

ప్లస్ పాయింట్స్:
జగపతి బాబు
సినిమాటోగ్రఫీ
సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్:
కథ, కథనం
ఫస్ట్ హాఫ్
కొన్ని అనవసరపు సన్నివేశాలు
సంగీతం

విశ్లేషణ:
పోస్టర్స్, ట్రైలర్ తో ‘పటేల్ సర్’ సినిమాపై అంచనాలను పెంచేశారు దర్శకుడు. జగపతిబాబు తన లుక్స్ తో మరింత ఆకట్టుకున్నాడు. అయితే ఆ ఆసక్తిని సినిమా చూసే ప్రేక్షకుల్లో కలిగించలేకపోయాడు. తన కొడుకుకి జరిగిన అన్యాయంపై పగ తీర్చుకునే తండ్రి కథే ‘పటేల్ సర్’. అయితే ఇక్కడ తండ్రీకొడుకులు ఇద్దరు జగపతిబాబు కావడం ప్లస్ పాయింట్. సినిమా ఫస్ట్ హాఫ్ రొటీన్ కథనంతో నడిపించారు. సెకండ్ హాఫ్ కాస్త బెటర్ గా అనిపిస్తుంది. ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాయి. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు రొటీన్ గానే అనిపిస్తాయి. అయితే సినిమాను మొత్తం తన భుజాలపై వేసుకొని నడిపించాడు జగపతిబాబు. తండ్రి పాత్రలో, కొడుకు పాత్రలో అధ్బుతంగా నటించాడు. ఎమోషన్స్ ను బాగా పండించాడు. పద్మప్రియ, ఆమని తన పాత్రల పరిధుల్లో బాగానే నటించారు. కబీర్ దుహన్ సింగ్ రోల్ మరీ రొటీన్ గా అనిపిస్తుంది. పోసాని కృష్ణమురలి, రఘు బాబు కామెడీ పండించే ప్రయత్నం చేశారు. సుబ్బరాజ్ రోల్ పాత్రకు రాసుకున్న ట్విస్ట్ ప్రేక్షకుల ఊహకు అందేస్తుంది. టెక్నికల్ సినిమాను క్వాలిటీతో రూపొందించారు.
సినిమాటోగ్రఫీ వర్క్ బావుంది. సినిమాలో పాటలన్నీ ఎక్కడో విన్న ఫీలింగ్ ను కలిగిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సివుంది. జగపతిబాబు తప్ప సినిమా గురించి చెప్పుకోవడానికి మరే అంశం కూడా లేదు. జగపతిబాబు కోసం ఒకసారి ఈ సినిమాను చూడొచ్చు
రేటింగ్: 2/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu