HomeTelugu Trendingమారుతితో ప్రభాస్ సినిమా!

మారుతితో ప్రభాస్ సినిమా!

Prabhas movie with director
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ఈ మధ్య కాలంలో అన్నీ పాన్‌ ఇండియా సినిమాలే చేస్తూ వస్తున్నాడు. వందల కోట్ల బడ్జెట్ .. వేల కోట్ల బిజినెస్ అన్నట్టుగా ఆయన సినిమాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను డైరెక్టర్‌ మారుతి ఒప్పించడం విశేషం. ప్రభాస్ తో కనుక మారుతి ఆ స్థాయిలోనే ఈ సినిమాను ప్లాన్ చేయలేదు.

బడ్జెట్ పరంగా మారుతి సినిమాల రేంజ్ లోనే ఈ ప్రాజెక్ట్ ఉండనుంది. ఈ కథ అంతా కూడా ‘రాజా డీలక్స్’ అనే ఒక సినిమా థియేటర్ చుట్టూ తిరుగుతుంది. హారర్ టచ్ తో సాగే మారుతి మార్క్ కామెడీ సినిమా ఇది. కథ వినగానే ప్రభాస్ ఈ సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా కానిచ్చేద్దాం అనడానికి కారణం అందులోని కొత్తదనమే కారణం అని అంటున్నారు. వచ్చేనెలలో ఈ సినిమా షూటింగు మొదలవుతుందని వినికిడి. పదిరోజుల పాటు జరిగే ఫస్టు షెడ్యూల్లోనే ప్రభాస్ పాల్గొంటాడని తెలుస్తుంది. ఇటు ‘సలార్’ ..అటు’ ప్రాజెక్టు K’ పూర్తయ్యేలోగా ‘రాజా డీలక్స్’ను కూడా పూర్తిచేసే ఆలోచనలో ఉన్నారని టాక్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu