ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచిన ప్రభాస్‌.. ఖాళీ ఖాతాలో లక్షల్లో ఫాలోవర్లు

యంగ్‌ రెబెల్‌ స్టార్ ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచారు. అయితే తన ఖాతాలో ఇంకా ప్రొఫైల్‌ ఫొటో కానీ, వివరాలు కానీ పోస్ట్‌ చేయలేదు. అధికారికంగా ప్రకటించకపోయినా, ఆయన ఖాతాకు ఏడు లక్షలకు చేరువలో ఫాలోవర్లు ఉండటం గమనార్హం. ఇప్పటివరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ పోస్ట్‌ పెట్టలేదు కూడా. కేవలం ఖాతాకు యాక్టర్‌ ప్రభాస్‌ అన్న పేరు మాత్రమే పెట్టుకున్నారు. ఆ ఒక్క పేరు చూసి ఇంత మంది అభిమానులు ఖాతాను అనుసరించడం మొదలుపెట్టారంటే ‘బాహుబలి’కి ఉన్న ఫాలోయింగ్‌ ఎంతో అర్థమవుతోంది. బహుశా ఆయన నటిస్తున్న ‘సాహో’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను తొలి ఫొటోగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయన ‘సాహో’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. సుజిత్‌ ‘సాహో’కు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమా మొత్తంలో ప్రభాస్‌ చేసే జెట్‌మ్యాన్‌ స్టంట్‌ హైలైట్‌గా ఉంటుందని చిత్రవర్గాలు అంటున్నాయి. ఈ సన్నివేశం ఉండాలని ప్రభాసే నిర్ణయించారట. ఇందుకోసం ఆయన హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ను నియమించుకున్నారు. అంతేకాదు.. సినిమాలో అన్ని యాక్షన్‌ సన్నివేశాలను, స్టంట్లను డూప్‌ లేకుండా ప్రభాసే చేశారట. ఆగస్ట్‌ 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

CLICK HERE!! For the aha Latest Updates