HomeTelugu Big Stories'సలార్‌' నుంచి ప్రభాస్‌ ఫొటో లీక్‌

‘సలార్‌’ నుంచి ప్రభాస్‌ ఫొటో లీక్‌

Prabhas photo leak from Saయంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో వస్తున్న ‘సలార్’‌ మూవీ ఫస్ట్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ గోదావరిఖని సింగరేణి కోల్‌మైన్స్‌లో జరుపుకున్న సంగతి తెలిసిందే. బొగ్గు గనుల సమీపంలో దాదాపు పది రోజుల పాటు ఈ మూవీ షూటింగ్‌ జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడి షూటింగ్‌ సెట్స్‌లోని ప్రభాస్‌ సంబంధించి పలు ఫొటోలు లీక్‌​ అవుతూ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. తాజాగా మరో ఫొటో కూడా బయటకొచ్చింది. ఇందులో ప్రభాస్‌ బోగ్గు గనుల్లో బుల్లెట్‌ బైక్‌ నడుపుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కేజీఎఫ్‌’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో శృతీ హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ప్రభాస్‌ నటించిన ‘రాధేశ్యామ్’‌ షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుంది. వీటి తర్వాత ‘ఆదిపురుష్’‌, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా సినిమాలు చేయాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu