‘సావిత్రి’ కోసం కీర్తిసురేష్!

కీర్తిసురేష్.. ప్రస్తుతం దక్షిణాదిన ఎక్కువగా వినిపిస్తోన్న హీరోయిన్ పేరు ఇదే.. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ.. బిజీ హీరోయిన్ గా గడుపుతోంది. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఆమెను ఎన్నుకున్నట్లు సమాచారం. అశ్వనీదత్ నిర్మాతగా మళ్ళీ బిజీ కావాలనుకుంటున్నారు. ఈ క్రమంలో తన అల్లుడు డైరెక్ట్ చేయబోయే ‘సావిత్రి’ జీవిత కథను నిర్మించాలనుకుంటున్నారు. ఈ సినిమాలో సావిత్రి పాత్ర కోసం నిత్య మీనన్ ను ఎన్నుకున్నట్లు వార్తలు వినిపించాయి.

ఆ తరువాత విద్యాబాలన్ ను సంప్రదించినట్లు రోజుకో వార్త షికారు చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో సావిత్రి టైటిల్ రోల్ కోసం కీర్తిసురేష్ ను ఎంపిక చేసుకున్నట్లు అశ్వనీదత్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలానే మరో ముఖ్యమైన పాత్రలో సమంతా కనిపిస్తుందని అన్నారు. వీరితో పాటు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరావు, ఎస్వీ రంగారావు పాత్రలు కూడా ఉంటాని చెప్పారు.