HomeTelugu Trendingప్రభాస్‌ కొత్త సినిమా ఫొటోలు వైరల్‌

ప్రభాస్‌ కొత్త సినిమా ఫొటోలు వైరల్‌

c
టాలీవుడ్‌ హీరో యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తన 20 చిత్రాన్ని జిల్‌ ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్‌ లవ్‌ స్టోరి తెరక్కెకనున్న మూవీలో డార్లిం​​​గ్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. చివరి షెడ్యూల్‌ జార్జియాలో జరిగింది. తాజాగా సినిమాకు చెందిన ముహుర్తం ఫోటోలను దర్శకుడు రాధాకృష్ణ తన ట్విటర్‌లో విడుదల చేశారు.

పూజా కార్యక్రమానికి ప్రభాస్‌, కృష్ణం రాజు, ఎస్‌ఎస్‌ రాజమౌళి, వివి వినాయక్‌, పూజాహెగ్డే, కోన వెంకట్‌, నిర్మాతలు వంశీ, ప్రమోద్య హజరైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు పేరును మాత్రం ఖరారు చేయలేదు. ‘ఓ డియ‌’ర్ అనే టైటిల్‌ని చిత్ర యూనిట్‌ ప‌రిశీలిస్తోంది. ఇక మూవీ లాంచింగ్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కాగా ప్ర‌భాస్ త‌న 21వ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

11 6

11a

11b

Recent Articles English

Gallery

Recent Articles Telugu