HomeTelugu Trendingప్రభాస్‌ లగ్జరీ కారు.. ఫొటోలు వైరల్‌

ప్రభాస్‌ లగ్జరీ కారు.. ఫొటోలు వైరల్‌

Prabhas purchased lamborghiయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘రాధేశ్యామ్​’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ‘సలార్’, ‘ఆదిపురుష్’​, నాగ్​అశ్విన్​ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సౌత్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఈ హీరో అన్ని భాషల ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు పాన్‌ ఇండియా మార్గంలో వెళ్తున్నాడు. తాజాగా ప్రభాస్ ఓ ఖరీదైన కారును సొంతం చేసుకున్నాడు. లంబోర్గిని అవెంటాడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌ కారును ప్రభాస్‌ కొనుగోలు చేశాడు. దీని ధర సుమారు 5.6 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా ప్రభాస్‌కు ఇప్పటికే బీఎమ్‌డబ్ల్యూ 520D, ఇన్నోవా క్రిస్టా, జగువార్‌ ఎక్స్‌జేఎల్‌ కార్లు ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా ప్రభాస్ గ్యారేజీలోకి మరో విలాసవంతమైన కారు చేరింది. ఈ కారు నిన్న రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu