ప్రభాస్ కు వచ్చిన పెళ్లి ప్రపోజల్స్ సంఖ్య!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రెబల్ స్టార్ ప్రభాస్. తను పెళ్లికి ఎప్పుడు ఓకే అంటాడా అని..? కుటుంబం, స్నేహితులతో పాటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ మాత్రం పెళ్లి ప్రస్తావన తెస్తుంటే సింపుల్ గా నవ్వేసి తప్పించుకుంటున్నాడు. బాహుబలి సినిమా కోసం ప్రభాస్ ఐదేళ్ళ పాటు తన సమయాన్ని ఆ ఒక్క సినిమా కోసమే కేటాయించాడు. ఈ ఐదేళ్ళలో తను సినిమాలనే కాదు.. వ్యక్తిగతంగా కూడా చాలానే త్యాగం చేశాడు. తన పెళ్లి విషయాన్ని కూడా వాయిదా వేసుకున్నాడు.
ప్రభాస్ కు తన ఇంట్లో ఎప్పటినుండో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే ఈ ఐదేళ్ళలో ఆయనకు ఎన్ని పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయో తెలుసా.? దాదాపుగా 6 వేలకు పైగానే. ఈ విషయాన్ని ఓ జాతీయ సంస్థ వెల్లడించింది. అయితే బాహుబలి సినిమా కోసమే ఈ ప్రపోజల్స్ సంగతి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ కు భీమవరం ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయబోతున్నట్లు ఇటీవల కొన్ని వార్తలు వినిపించాయి. మరి ఇప్పట్లో ప్రభాస్ వివాహం చేసుకుంటాడో.. లేక సినిమాల పేరు చెప్పి తప్పించుకుంటాడో.. చూడాలి!