జయప్రకాశ్‌ రెడ్డి మృతిపై సినీప్రముఖులు సంతాపం

నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి పై సినప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి: జయప్రకాశ్ రెడ్డి మరణం సినీఇండస్ట్రీకి తీరనిలోటు అని.. ఆయనతో చివరగా ఖైదీ నెం 150 లో నటించాను. ఆయన గొప్పనటుడు, నాటకరంగం నన్ను కన్నతల్లి, సినిమా రంగం నన్ను పెంచిన తల్లి అనే వారు. అందుకే శని ఆదివారాల్లో షూటింగ్లు పెట్టుకొనండి, స్టేజ్ పర్ఫామెన్స్‌లు ఇస్తుంటాను… మీరు ఎప్పుడైనా రావాలి. అని అడిగారు కానీ నేను ఆ అవకాశాన్ని పొందలేకపోయాను. సినిమాల్లో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అంటే ముందు గుర్తొచ్చేది ఆయనే. తనకంటూ ఓ ప్రత్యేక ట్రెండ్ ను సృష్టించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి నా ప్రగాఢసానుభూతి తెలుపుతున్నాను.” అని చిరంజీవి పేర్కొన్నారు.

జెనీలియ్‌: “జయప్రకాష్ రెడ్డిగారి మరణం నన్ను చాలా బాధించింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను. షూటింగ్ సమయంలో మీతో ఉన్న క్షణాలు ఎంతో సందడిగా ఉండేవి. మీ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు: “జయప్రకాశ్ రెడ్డి గారి మృతి నన్ను కలిచివేసింది. ఇండస్ట్రీలోని అత్యుత్తమ నటులలో ఆయన ఒకరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.

విక్ట‌రీ వెంక‌టేశ్: నా ప్రియ మిత్రుడు జయప్రకాశ్ రెడ్డి గారి మ‌ర‌ణవార్త విని నేను చాలా బాధ‌ప‌డ్డాను. వెండితెర‌పై మా కాంబినేష‌న్ అద్భుతంగా ఉండేది. ఆయ‌న‌ను చాలా మిస్ అవుతాను. ఆయ‌న కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని ట్వీట్ చేశారు.

రవితేజ: “జయప్రకాష్ రెడ్డి గారు మరణం బాధాకరం, నేను ఆయనను ప్రేమగా మామ అనిపిలుస్తాను. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని నష్టం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మామ మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్: “అభూతమైన నటనతో అందరిని ఆకట్టుకున్న జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు.

ప్రకాశ్ రాజ్: “జయప్రకాష్ రెడ్డి గారికి నటనంటే ప్రాణం. అటు వెండితెరపైన, ఇటు స్టేజ్ నాటకాలలోను పోషించిన పాత్రలకు ప్రాణం పోసిన నటుడు ఆయన. ఆయన హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది”. అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ : ఇది చాలా బాధాకరం జయప్రకాశ్ రెడ్డి గారితో కలిసి చాలా సినిమాల్లో నటించాను , ఆయన కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలుపుతున్నారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి ” అని పేర్కొన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates