HomeTelugu Trendingబాలీవుడ్‌ స్టార్‌ హిరోతో ప్రభాస్‌ భారీ మల్టీస్టారర్‌..

బాలీవుడ్‌ స్టార్‌ హిరోతో ప్రభాస్‌ భారీ మల్టీస్టారర్‌..

2 6
టాలీవుడ్ హీరో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్‌తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.. ఇంతలోనే ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త వైరల్‌ అవుతోంది. ఇది మల్టీ స్టారర్ చిత్రమనీ, ఇందులో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడనీ అంటున్నారు. హృతిక్, ప్రభాస్.. ఇద్దరికీ కూడా యాక్షన్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఫిల్మ్‌గా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇక దీనికి ‘తానాజీ’ ఫేం ఓమ్ రావత్ దర్శకత్వం వహిస్తాడనీ, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ టీ సీరీస్ దీనిని నిర్మిస్తుందని సమాచారం.

ఇదిలా వుంటే.. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో ‘రాధే శ్యామ్’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించే మరో భారీ చిత్రంలో నటిస్తాడు. ఆ తర్వాతే బాలీవుడ్ దర్శకుడి మల్టీ స్టారర్ మొదలవుతుంది అని తెలుస్తోంది. ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి హృతిక్ నటించబోతున్నారనడంతో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu