HomeTelugu Trending'పుష్ప' లో అల్లు అర్జున్‌ సహానటుడు అరెస్ట్‌

‘పుష్ప’ లో అల్లు అర్జున్‌ సహానటుడు అరెస్ట్‌

Pushpa actor jagadish arr
పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’లో హీరో అల్లు అర్జున్ పక్కన సహాయ నటుడి పాత్రలో కనిపించిన నటుడు జగదీశ్‌‌ను (కేశవ) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఓ జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో ఉండగా ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడిన అభియోగంపై అతడిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న మహిళ.. జగదీశ్ వేధింపుల నేపథ్యంలో గత నెల 29న ఆత్మహత్య చేసుకుంది. గత నెల 27న బాధిత మహిళ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో జగదీశ్ ఫొటోలు తీశాడు. ఆపై ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగడంతో తీవ్ర ఆవేదనకు లోనైన బాధితురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Pushpa actor 2

ఈ కేసులో తప్పించుకు తిరుగుతున్న జగదీశ్‌ను నేడు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, మృతురాలితో జగదీశ్‌కు గతంలో పరిచయం ఉండేదని పోలీసులు తెలిపారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu