HomeTelugu Trendingమోడీ మరో బయోపిక్.. ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన ప్రభాస్

మోడీ మరో బయోపిక్.. ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన ప్రభాస్

5a 5
ప్రధాని మోడీ జీవితం ఆధారంగా మరో సినిమా తెరకెక్కబోతుంది. ఎన్నికలకు ముందు ఆయన జీవిత ఆధారంగా పీఎం నరేంద్ర మోడీ పేరుతో ఓ చిత్రం విడుదలైంది. మోడీగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ నటించిన ఈ సినిమాకు ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. తాజాగా మోడీ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తోన్న చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. హిందీలో మన్ బైరాగి పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో మనోవిరాగి పేరుతో విడుదల చేయబోతున్నారు. మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హీరో ప్రభాస్ విడుదల చేశారు.

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫస్ట్‌లుక్ పోస్టర్లను తన అభిమానులు, తెలుగు ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున ఒక ప్రత్యేకమైన వ్యక్తిపై మరో ప్రత్యేకమైన ఫిల్మ్ మేకర్ ఒక ప్రత్యేకమైన సినిమాను ప్రకటించారు. నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సంజయ్ లీలా భన్సాలీ, మహవీర్ జైన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న మన్ బైరాగి సినిమా ఫస్ట్‌లుక్‌ను నేను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. మోడీ గురించి ప్రజలకు తెలియని కథ ఇది. సంజయ్ త్రిపాఠి దర్శకత్వం వహిస్తున్నారు అని ప్రభాస్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సినిమా హిందీ ఫస్ట్‌లుక్‌ను అక్షయ్ కుమార్ విడుదల చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu