HomeTelugu Trendingఅనుష్క కోసం ప్రత్యేకంగా 'సాహో' షో!

అనుష్క కోసం ప్రత్యేకంగా ‘సాహో’ షో!

9 8యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్, హీరోయిన్‌ అనుష్క వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు గత కొద్దికాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను వీరిద్దరూ కొట్టి పారేశారు. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని తెల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన మరో వార్త సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘సాహో’. ఈ చిత్రం ఆగస్టు 30న విడుదల కానున్న సంగతి తెలిసిందే. కానీ దాని కంటే ముందే ప్రభాస్‌, అనుష్క కోసం ప్రత్యేకంగా ఓ షో వేయనున్నారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ విషయం గురించి ఇటీవలే ఓ ఆంగ్ల పత్రిక తెలియజేసింది. విభిన్న భాషల్లో తెరకెక్కుతున్న సాహో చిత్రంతో ప్రభాస్‌ మొదటిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటికే ట్రైలర్‌, టీజర్‌ పోస్టర్లతో జాతీయ వ్యాప్తంగా హైప్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమా ఆగస్టు 30న విడుదలకు సిద్ధంగా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu