HomeTelugu Trendingప్రభాస్‌కు జంటగా కత్రినా కైఫ్‌!

ప్రభాస్‌కు జంటగా కత్రినా కైఫ్‌!

Prabhas with katrina kaif
టాలీవుడ్‌ హీరో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. వందల కోట్ల రూపాయలతో ఈయన సినిమాలు రూపొందుతున్నాయి. వేల కోట్ల బిజినెస్ జరుపుకుంటున్నాయి. టాలీవుడ్ దర్శకులకు ఆయన డేట్లు దొరకడమే కష్టమైపోతోంది. ఇతర భాషలకి చెందిన బడా నిర్మాతలు .. దర్శకులు ప్రభాస్ తో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు. ఆయన తాజా చిత్రంగా ‘రాధే శ్యామ్’ విడుదలకు రెడీగా ఉండగా.. ‘సలార్’ .. ‘ ఆది పురుష్’ ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి. ఆ తరువాత ఆయన నాగ్ అశ్విన్ తో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చేయనున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే కావడం విశేషం.

ఈ సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయనేది తెలియదు. కానీ ప్రభాస్ మాత్రం తన దూకుడు ఆపడం లేదు. ‘వార్’ వంటి యాక్షన్ సినిమాలతో ‘ఔరా’! అనిపించిన సిద్ధార్థ్ ఆనంద్ కి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘కత్రినా కైఫ్’ ను తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఎంపిక దాదాపు ఖాయమవుతుందనే అంటున్నారు. వీరి జంట ఒక రేంజ్ లో సందడి చేయవచ్చు అని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu