HomeTelugu Trendingవారసుడి హీరోయిన్‌తో బాబాయ్ రొమాన్స్‌‌!

వారసుడి హీరోయిన్‌తో బాబాయ్ రొమాన్స్‌‌!

5 8
మెగా హీరో వరుణ్‌తేజ్‌ నటించిన ‘కంచె’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో ప్రగ్యా పక్కింటి అమ్మాయిగా నటించి మెప్పించింది. ఈ సినిమా హిట్ కావడంతో వరసగా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఈ హీరోయిన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం మొదలుపెట్టాయి. పక్కింటి అమ్మాయి పాత్రల నుంచి గ్లామర్ హీరోయిన్ గా అందాలు ఒలకబోస్తున్న పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.

కాగా, ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ కు ఓ అవకాశం వచ్చినట్టుగా తెలుస్తోంది. అదేమంటే, పవన్ కళ్యాణ్ తన 27 వ సినిమా క్రిష్ డైరెక్షన్‌లో వహిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్, ప్రగ్యా జైస్వాల్ లు హీరోయిన్ గా చేస్తున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాతో ప్రగ్యా తిరిగి స్టార్ హీరోయిన్ గా మారుతుందని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu